Vaikunta Ekadasi 2020: తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

Vaikunta Ekadasi 2020: తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి(Vaikunta Ekadasi) వేడుకలు వైభంగా జరుగుతున్నాయి. వేకువ జాము నుంచే భక్తులు వైష్ణవ ఆలయాలకు పోటెత్తారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా సింహాద్రి అప్పన్న (simhadri appanna swamy)ఉత్తరద్వారం ద్వారా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. పశ్చిమగోదారవరి జిల్లా ద్వారకా తిరుమలలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్తర ద్వారం గుండా చిన్న వెంకన్న భక్తులకు దర్శనమిస్తున్నాడు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఇచ్చారు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి.(yadadri lakshmi narasimha swamy) ఉదయం ఆరు గంటల 43 నిమిషాలకు యాదాద్రిలోని ఉత్తర ద్వారాలు తెరుచుకున్నాయి. అటు భద్రాచలం(Bhadrachalam)లోనూ వైకుంట ఏకాదశి వేడుకలు వైభంగా జరుగుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com