Vanasthalipuram: వనస్థలిపురం బ్యాంక్ చోరి కేసులో ట్విస్ట్.. సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన నిందితుడు..

Vanasthalipuram: హైదరాబాద్‌లోని వనస్థలిపురం బ్యాంక్ ఆఫ్ బరోడా క్యాషియర్ కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. బ్యాంకులో రూ.22.53 లక్షలు చోరీకి గురైంది. డబ్బు మాయం కావడంతో.. క్యాషియర్ ప్రవీణ్‌పై అనుమానం వ్యక్తం చేశారు. చోరీ జరిగిన మరుసటి రోజు నుంచి కనిపించకుండా పోవడంతో క్యాషియరే ప్రవీణే.. డబ్బు దొంగిలించాడని తేలింది. అంతకుముందు మేనేజర్ దగ్గకు వెళ్లి.. ఒంట్లో బాగోలేదని బయటకు వెళ్తానని చెప్పిన ప్రవీణే.. నగదు తీసుకొని పారిపోయినట్లు గుర్తించారు.
మేనేజర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. చోరీ విషయం మీడియాలో రావడంతో ప్రవీణ్‌లో కలవరం మొదలైంది. దీంతో తానే డబ్బు తీసుకెళ్లానని బ్యాంకు మేనేజర్‌కు మెసేజ్ పెట్టాడు. క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బులు పోవడంతోనే దొంగతనం చేయాల్సి వచ్చిందని చెప్పాడు. బెట్టింగ్‌లో డబ్బులు వస్తే.. ఆ సొమ్ము తిరిగి ఇచ్చేస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని మేసేజ్‌లో చెప్పాడంటున్నారు మేనేజర్.
అయితే.. మళ్లీ మాట మార్చాడు ప్రవీణ్. బ్యాంకు నుండి డబ్బులు తాను తీసుకెళ్ళలేదంటూ సెల్ఫీ వీడియో పంపాడు. బ్యాంకులో నగదు లావాదేవీల్లో తక్కువగా వచ్చిన నగదును తనపై పడేస్తున్నారని ఆరోపించాడు. బ్యాంకు మేనేజర్, సిబ్బంది పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలోనూ అనేక సార్లు నగదు తక్కువగా ఉండటంపై తాను నిలదీసినా మేనేజర్ పట్టించుకోలేదన్నాడు. అనవసరంగా తనను బ్లేమ్ చేస్తున్నారని ఆరోపించాడు.
ఈ చోరీ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు వనస్థలిపురం పోలీసులు. బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు కేసు నమోదు చేసినట్లు తెలిపారు ఏసీపీ పురుషోత్తం రెడ్డి. ఆత్మహత్య చేసుకోవద్దని క్యాషియర్ ప్రవీణ్‌ను ఏసీపీ కోరారు. ఈ చోరీ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. క్యాషియర్ ప్రవీణ్ కోసం గాలిస్తున్నారు. క్రికెట్ బెట్టింగు వ్యవహారమే చోరీకి కారణని భావిస్తున్నారు పోలీసులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com