Vande Bharath: సికింద్రాబాద్ నుంచి తిరుపతికి....

Vande Bharath: సికింద్రాబాద్ నుంచి తిరుపతికి....
బీబీనగర్-నడికుడి మార్గంలో మిర్యాలగూడ మీదుగా నడపాలని రైల్వే శాఖ నిర్ణయం

సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందేభారత్ రైలు రూట్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ రైలును బీబీనగర్-నడికుడి మార్గంలో మిర్యాలగూడ మీదుగా నడపాలని రైల్వే శాఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ముందుగా వందేభారత్‌ను వరంగల్-ఖాజీపేట మార్గంలో నడపాలని భావించినప్పటికీ.. దూరం ఎక్కువ అవుతుందనే అంచనాతో బీబీనగర్-నడికుడి మార్గం వైపే మొగ్గు చూపారు. ఇప్పటికే బీబీనగర్ నుంచి గుంటూరు వరకు ఉన్న రైల్వే మార్గంలో ట్రాక్‌లను ఆధునీకరించారు. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ మార్గంలో తిరుపతికి నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ వెళ్తోంది. 664 కిలోమీటర్ల దూరాన్ని పన్నెండున్నర గంటల సమయంలో చేరుకుంటోంది. వందేభారత్ రైలును ఈ రూట్‌లో నడపడం ద్వారా దూరంతో పాటు సమయం కూడా తగ్గించాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story