Venkaiah Naidu: రోశయ్య సేవలను గుర్తుచేసుకున్న వెంకయ్య నాయుడు..

X
Venkaiah Naidu: రోశయ్య మరణం ఎంతో బాధించిందన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. తన అంకితభావం, నిబద్ధతతో ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారన్నారు. రోశయ్య తనకు చిన్ననాటి స్నేహితుడన్నారు వెంకయ్య. రోశయ్యకు చాలా అంశాలపై స్పష్టమైన విషయ పరిజ్ఞానం ఉండేదన్నారు. ఎవరినీ నొప్పించకుండా, విషయాన్ని సూటిగా చెప్పడంలో ఆయన సిద్ధహస్తులని కొనియాడారు. ఏకంగా 16సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. చక్కటి వ్యక్తిత్వంతో ఎలాటిం ఆడంబరం, గర్వం లేకుండా ఉన్న రోశయ్య ఇక లేరనే వార్త చాలా బాధాకరమన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరలని ప్రార్థిస్తూ....వారి కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలియజేశారు వెంకయ్య నాయుడు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
