భద్రం బీ కేర్ ఫుల్ బ్రదరూ.. లైవ్ లో కొట్టుకుంటున్న నాయకులు..

భద్రం బీ కేర్ ఫుల్ బ్రదరూ.. లైవ్ లో కొట్టుకుంటున్న నాయకులు..
ఎన్నికలు సమీపిస్తున్న వేళ నాయకుల వాగ్ధానాలతో హోరెత్తుతున్నాయి

ఎన్నికలు సమీపిస్తున్న వేళ నాయకుల వాగ్ధానాలతో హోరెత్తుతున్నాయి న్యూస్ ఛానెళ్లు. లైవ్ డిబేట్ లు చేస్తూ తమకు ఎందుకు ఓటెయ్యాలో చెబుతున్నారు. గెలిపిస్తే ఏం చేస్తామో వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ న్యూస్ ఛానెల్ లో లైవ్ డిబేట్ కి వచ్చిన ఇద్దరు నాయకులు శృతి మించి ప్రవర్తించారు. జనం తమని చూస్తున్నారన్న సోయ లేకుండా తన్నుకున్నారు. ఒక పొలిటికల్ లీడర్ ఎంత డీసెంట్ గా ఉంటే ప్రజల దృష్టిని ఆకర్షిస్తారో అన్న విషయాన్ని మర్చిపోయి ప్రవర్తించారు.

లైవ్ న్యూస్ డిబేట్ సమయంలో బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడు బీజేపీ ప్రత్యర్థి మెడ పట్టుకున్నారు. నవంబర్ 30న జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒక తెలుగు న్యూస్ ఛానెల్ నిర్వహించిన లైవ్ డిబేట్‌లో భారత రాష్ట్ర సమితి (BRS) ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ తన బిజెపి ప్రత్యర్థి మెడ పట్టుకుని దాడి చేశారు.

తెలంగాణలోని కుత్బుల్లాపూర్‌కు చెందిన భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, బిజెపి అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్‌ ఛానెల్ లైవ్ డిబేట్ లో పాల్గొన్నారు. వివేకానంద బీజేపీ నేత వైపు దూసుకెళ్లి మెడ పట్టుకోవడం కెమెరాకు చిక్కింది. పలువురు వ్యక్తులు వేదికపైకి వెళ్లి ఇద్దరినీ విడదీయడానికి ప్రయత్నించారు. నాయకుల మద్దతుదారులు బారికేడ్‌ను ఛేదించి ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు.

రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి X లో సంఘటనకు సంబంధించిన వీడియోను పంచుకున్నారు. "BRS యొక్క ముఖ్య లక్షణం - గూండాయిజం" అని రాశారు.తెలంగాణ ప్రజలను హెచ్చరించిన రెడ్డి, రాష్ట్రంలో బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే తమపై కూడా “అదే విధంగా దాడులు” చేస్తారా అని ప్రశ్నించారు.

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక బీజేపీ అభ్యర్థిపై దాడి చేశారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని రెడ్డి డిమాండ్‌ చేశారు. కేసు పెట్టకుంటే బీజేపీ న్యాయ పోరాటం చేస్తుందని హెచ్చరించారు.

మరోవైపు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తండ్రిని ఉద్దేశించి బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్‌ చేసిన ప్రస్తావన వల్లే గొడవ జరిగిందని బీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి శ్రవణ్ దాసోజు తెలిపారు. చర్చ సమయంలో ఇద్దరూ మర్యాదను కొనసాగించాలని ఆయన అన్నారు. "ప్రపంచం మొత్తం తమను గమనిస్తోందని గ్రహించాలి" అని దాసోజు పేర్కొన్నారు.

Tags

Next Story