Vijay Devarakonda: అప్పుడు ప్రేమ.. ఇప్పుడు ఆరాధన: విజయ్ ట్వీట్ వైరల్

Vijay Devarakonda: అప్పుడు ప్రేమ.. ఇప్పుడు ఆరాధన: విజయ్ ట్వీట్ వైరల్
Vijay Devarakonda: అందం, అభినయం, వర్క్ డెడికేషన్ అభిమానులతో సెలబ్రెటీలకు కూడా నచ్చుతుంది నటి సమంత.

Vijay Devarakonda: అందం, అభినయం, వర్క్ డెడికేషన్ అభిమానులతో సెలబ్రెటీలకు కూడా నచ్చుతుంది నటి సమంత. కాలేజీ రోజుల్లో ఆమెని సిల్వర్ స్క్రీన్‌పై చూసి ప్రేమలో పడిపోయానని చెబుతున్నాడు నటుడు విజయ్ దేవరకొండ.


సామ్ ప్రధాన పాత్రలో నటించిన యశోద ట్రైలర్‌ను విడుదల చేస్తూ విజయ్ ట్వీట్ చేశారు. అందులో ఈ విషయాన్ని తెలిపారు. అప్పుడు ప్రేమలో పడ్డాను. ఇప్పుడు ఆరాధిస్తున్నాను అని రాసుకొచ్చాడు.


మహానటిలో మీ ఇద్దరి జోడీ అద్భుతంగా ఉంది. ఖుషీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాం అని అభిమానులు విజయ్‌ని, సామ్‌ని ఉద్ధేశించి కామెంట్ చేస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఖుషి లవ్ ఎంటర్‌టైనర్. ఈ చిత్రం ఇంకా చిత్రీకరణ దశలో ఉంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, మేకింగ్ వీడియోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

ఇక సామ్ నటిస్తున్న మరో చిత్రం యశోద విషయానికి వస్తే .. ఒక సరోగెంట్ మదర్‌గా అన్యాయాలకు పాల్పడుతున్న కొందరు వ్యక్తులపై సామ్ చేసే పోరాటం ఆధ్యంతం ఆకట్టుకునేలా ఉంది. తాజాగా విడుదలైన ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. హరి-హరీశ్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags

Next Story