ఖైరతాబాద్‌లో విజయారెడ్డి, చర్లపల్లిలో బొంతు శ్రీదేవీ గెలుపు

గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది. చర్లపల్లి డివిజన్ నుంచి మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి బొంతు శ్రీదేవీ గెలుపొందారు. అలాగే ఖైరతాబాద్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి, దివంగత నేత పీజేఆర్ తనయ విజయారెడ్డి విజయం సాధించారు. కె.పి.హెచ్.పీ డివిజన్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి మందాడి శ్రీనివాసరావు 1540 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. హస్తినపురంలో బీజేపీ అభ్యర్థి సుజాత నాయక్ 680 ఓట్లతో గెలుపొందారు. కూకట్‌పల్లిలో జూపల్లి సత్యనారాయణ గెలుపొందారు.
రామంతపూర్‌లో బీజేపీ అభ్యర్థి బండారు శ్రీవాణి విజయం సాధించారు. నాచారం డివిజన్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి శాంతి సాయిజన్, వనస్థలిపురం డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి రాగుల వెంకట్ రెడ్డి, జగద్గిరిగుట్ట డివిజన్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి జగన్ , హబ్సిగూడలో బీజేపీ అభ్యర్థి కే. చేతన గెలుపొందారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com