'మేయర్' పదవి 'మేసే'వారికి ఇస్తారా..: విజయశాంతి

సీఎం కేసిఆర్‌పై సీనియర్ నటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. త్వరలో జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై ఆమె స్పందించారు. ఫేస్‌బుక్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ మేయర్ పదవిని మేసేవారికి కాకుండా మేయరు అనే వారికి దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఇటీవల జరిగిన దుబ్బాక ఎన్నికల్లో ఫలితాలు అనుకూలంగా లేకపోయినా ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఓటమిని కప్పిపుచ్చుకునేందుకు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వంద సీట్లకు పైగా గెలుస్తామంటూ అసత్య ప్రకటనలు చేస్తున్నారని అన్నారు. అల్లాఉద్దీన్ అద్భుత దీపం మాదిరిగా, అసదుద్దీన్ అద్భుత దీపంతో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఏమైనా అద్భుతాలు జరుగుతాయేమోనని సీఎం ఆశిస్తున్నారు.
గెలిచిన నియోజకవర్గాల్లో ఏమాత్రం అభివృద్ధి చేయకుండా, మాయమాటలతో ఓటర్లను మోసం చేస్తున్నారని అన్నారు. ఈ విషయంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అందె వేసిన చేయిగా కనిపిస్తున్నారని అన్నారు. గత ఎన్నికల్లో కేసీఆర్ హామీలపై భ్రమలు పెంచుకున్న గ్రేటర్ ఓటర్లు ఈసారి మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థులకు తగిన గుణపాఠం నేర్పేందుకు సిద్ధమవుతున్నారని అన్నారు.
ఈసారి లెక్కలన్నీ తారుమారవుతాయని ఓటర్ల నాడిని చూస్తే అనిపిస్తోందని అన్నారు. ప్రజల అవసరాలు తీర్చే వారికే మేయర్ పదవి దక్కాలి కానీ మేసే వారికి కాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు విజయశాంతి ఫేస్‌బుక్ పోస్టులో పేర్కొన్నారు.
దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా, టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ గారు దొరహంకార గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ...
Posted by Vijayashanthi on Monday, November 16, 2020
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com