మహిళా దినోత్సవం సందర్భంగా GHMC కార్మికులకు విజయశాంతి సత్కారం..!

మహిళలకు మోదీ ప్రభుత్వం ఎంతో చేస్తోందన్నారు విజయశాంతి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా BJP మహిళా మోర్ఛా ఆధ్వర్యంలో హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా GHMC కార్మికుల్ని సన్మానించారు. వారంతా నగరాన్ని స్వచ్ఛంగా ఉంచుతున్నట్టే.. సమాజంలో చెడును కూడా తుడిచేయాల్సి ఉందన్నారు.
అందరి సపోర్ట్ వల్లే నాడు తెలంగాణ సాధించామన్న విజయశాంతి.. TRS ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా లేరని విమర్శించారు. అటు, విజయశాంతి మాట్లాడుతున్నప్పుడు మాస్క్ తీయాలని GHMC కార్మికులు కోరారు. విజయశాంతా కాదా అనే డౌట్ వచ్చే.. మాస్క్ తీయాలన్నామని చెప్పారు. దీంతో ఒక్కసారిగా నవ్వులు పూసాయి. రాములమ్మ సినిమా అంటే తమకు ఎంతో ఇష్టమని చెప్పిన ఆ మహిళలంతా.. విజయశాంతితో కాసేపు ముచ్చటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com