Vijayashanti: పుష్ప 2 విషాదం.. బీజేపీపై విజయశాంతి ఫైర్

సంధ్య థియేటర్ ఘటనపై నటి విజయశాంతి సంచలన కామెంట్స్ చేశారు. ‘ఒక సినిమా విడుదల సందర్భంగా జరిగిన దురదృష్ట సంఘటన ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య తెలంగాణల విభజన రేఖలు తెచ్చేలా.. గత రెండు రోజుల పరిణామాలు, ప్రెస్ మీట్లు తదనంతర భావోద్వేగాలు అగుపడుతున్నాయి. ఒక సంఘటనను తమకు అనుకూలంగా చేసుకునే ప్రక్రియగా బీజేపీ ప్రకటనలు కనబడుతున్నవి. సినిమా పరిశ్రమను నాశనం చేసేలా కనిపిస్తున్నాయి’ అంటూ ట్వీట్ చేశారు. ‘‘ఒక సినిమా విడుదల సందర్భంగా జరిగిన సంఘటన దురదృష్టకరం. ఈ ఘటనను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు భాజపా నేతలు యత్నిస్తున్నారు. ఆ పార్టీకి చెందిన తెలుగు రాష్ట్రాల నేతల ప్రకటనల్లో ఇది కనిపిస్తోంది. సినిమా పరిశ్రమను నాశనం చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం ప్రయత్నిస్తున్నారంటూ భాజపా కేంద్రమంత్రులు ఆరోపణలు చేయడం గర్హనీయం. సినీ పరిశ్రమకు అన్ని ప్రాంతాల ప్రజల ఆదరణ కావాలి. ఇలాంటి ఘటనలు జరగకుండా సమస్యను పరిష్కరించుకునేందుకు ప్రయత్నం చేయాలి’ అని పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com