Vijayashanti: తెలంగాణాలో పబ్ కల్చర్‌ను పూర్తిగా ఎత్తివేయాలి-విజయశాంతి

X
Vijayashanti (tv5news.in)
By - Divya Reddy |6 April 2022 3:11 PM IST
Vijayashanti: తెలంగాణాలో పెరిగిపోతున్న పబ్‌కల్చర్‌ను పూర్తిగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు విజయశాంతి.
Vijayashanti: భోలక్‌పూర్‌లో ఎంఐఎం కార్పొరేటర్ గౌసుద్దీన్.. పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన ఘటనపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు విజయశాంతి ఘాటుగా స్పందించారు. ఎంఐఎం, టీఆర్‌ఎస్‌లు కవలపిల్లలని.. వారి దురహంకారానికి ఇది నిదర్శనమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే బీజేపీ పాలన ఏర్పడాలన్నారు. బర్కత్‌పుర బీజేపీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న ఆమె.. తెలంగాణాలో పెరిగిపోతున్న పబ్‌కల్చర్‌ను పూర్తిగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. తల్లిదండ్రులు పిల్లలను జాగ్రత్తగా పెంచాలని.. డ్రగ్స్ బారిన పడకుండా చూడాలన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com