Vundavalli Arun Kumar: కేసీఆర్, ఉండవల్లి మధ్య లంచ్ మీటింగ్.. అయిదు గంటల చర్చ.. దానికోసమేనా..?

Vundavalli Aruna Kumar: బీజేపీని ఎదుర్కొనేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ పక్కా అజెండాతో ముందుకెళ్తున్నారన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్. కేసీఆర్‌ను కలవడానికి గల కారణాలను ప్రెస్‌మీట్‌లో వెల్లడించారు. ఇద్దరి మధ్య భేటీలో కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు పేర్కొన్నారు. పార్టీ గురించి ఎలాంటి చర్చ జరగలేదన్న ఉండవల్లి..సమావేశంలో ప్రశాంత్ కిషోర్ పాల్గొన్నారని తెలిపారు. దేశంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి.?
ఇవి ఇలాగే కొనసాగితే ఎలాంటి పరిస్థితులు వస్తాయన్న వివరాలపై కేసీఆర్‌కు పక్కా క్లారిటీ ఉన్నట్లు ఉండవల్లి పేర్కొన్నారు. బీజేపీ విధానాలపై ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన అవసరాన్ని కేసీఆర్ నొక్కిచెప్పినట్లు తెలిపారు. కేసీఆర్ ప్రధాన బలం తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్‌లో ప్రావీణ్యం కల్గిఉండటమే అన్నారు. ప్రధాని మోదీలా కమ్యూనికేట్ చేయగల సత్తా కేసీఆర్‌లో కనిపించిందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com