Telangana: తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్‌ తమిళిసై మధ్య వివాదం సుప్రీం కోర్టుకు..

Telangana: తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్‌ తమిళిసై మధ్య వివాదం సుప్రీం కోర్టుకు..
Telangana: తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్‌ తమిళిసై మధ్య ఉన్న వివాదం సుప్రీం కోర్టుకు చేరింది.

Telangana: తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్‌ తమిళిసై మధ్య ఉన్న వివాదం సుప్రీం కోర్టుకు చేరింది. 10 బిల్లుల‌ను గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ ఆమోదించకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సుప్రీం కోర్టులో రిట్‌ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిష‌న్‌లో ప్రతివాదిగా గవర్నర్‌ తమిళిసై పేరును చేర్చారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులను గవర్నర్‌ ఆమోదించేలా ఆదేశాలివ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీం కోర్టులో రిట్‌ పిటిషన్‌ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది.

సెప్టెంబర్‌ నుంచి 7 బిల్లులు.. గత నెల నుంచి 3 బిల్లులు.. మొత్తం పది బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. ఇందులో తెలంగాణ విశ్వవిద్యాలయ ఉమ్మడి రిక్రూట్‌మెంట్‌ బోర్డు బిల్లు… ములుగులో అటవీ కళాశాల, పరిశోధన సంస్థను అటవీ వర్సిటీగా అప్‌గ్రేడ్‌ చేసిన బిల్లు.. అజమాబాద్‌ ఇండస్ట్రియల్‌ ఏరియా చట్ట సవరణ .. మున్సిపల్‌ చట్ట సవరణ... పబ్లిక్‌ ఎంప్లాయ్‌మెంట్‌ చట్ట సవరణ…. ప్రైవేటు యూనివర్సిటీల సవరణ బిల్లు..

మోటార్‌ వెహికిల్‌ ట్యాక్సేషన్‌ సవరణ బిల్లు… మున్సిపల్‌ చట్ట సవరణ-2,

పంచాయతీరాజ్‌ చట్ట సవరణ-2, అగ్రికల్చర్‌ యూనివర్సిటీ బిల్లులు ఉన్నాయి.

సుప్రీంకోర్టుకు చేరిన తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్‌ మధ్య వివాదం

అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను పెండింగ్‌లో పెట్టారంటూ..

సుప్రీం కోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం

పెండింగ్‌లో మొత్తం 10 బిల్లులు

1.తెలంగాణ విశ్వవిద్యాలయ ఉమ్మడి రిక్రూట్‌మెంట్‌ బోర్డు బిల్లు

2.ములుగులో అటవీ కళాశాల, పరిశోధన సంస్థను అటవీ వర్సిటీగా అప్‌గ్రేడ్‌ చేసిన బిల్లు

3.అజమాబాద్‌ ఇండస్ట్రియల్‌ ఏరియా చట్ట సవరణ

4.మున్సిపల్‌ చట్ట సవరణ

5.పబ్లిక్‌ ఎంప్లాయ్‌మెంట్‌ చట్ట సవరణ

6.ప్రైవేటు యూనివర్సిటీల సవరణ బిల్లు

7.మోటార్‌ వెహికిల్‌ ట్యాక్సేషన్‌ సవరణ బిల్లు

8.మున్సిపల్‌ చట్ట సవరణ-2

9.పంచాయతీరాజ్‌ చట్ట సవరణ-2

10.అగ్రికల్చర్‌ యూనివర్సిటీ

పెండింగ్‌లో ఉన్న బిల్లులను గవర్నర్‌ తమిళిసై..

వెంటనే ఆమోదించేలా ఆదేశించాలని కోరిన తెలంగాణ సర్కార్‌

రేపు పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం

Tags

Next Story