Warangal : హనుమకొండలో ఉచిత కేన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు

గ్రేస్ కేన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హనుమకొండలోని బాప్టిస్ట్ మిషన్ ఆసుపత్రిలో ఆదివారం ఉదయం 10 టంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉచిత కేన్సర్ స్క్రీనింగ్ టెస్టుల క్యాంప్ ను నిర్వహించనున్నారు. ఈ అవకాశాన్నిహనుమకొండ, వరంల్, పరిసర ప్రాంత ప్రజలంతా వినియోగంచుకోవాలని డా. నెల్సన్ అన్నారు. కేన్సర్ భయంకరమైన వ్యాధి దానిని మొదటనే గుర్తించగలిగితే నయం చేసే అవకాశం ఉందని, స్క్రీనంగ్ టెస్టుల ద్వారా సులభంగా గుర్తించగలమని అన్నారు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని తెలిపారు.
కేన్సర్ వ్యాధి నిపుణులు డా. సుంకపల్లి చిన బాబు అతని బృందం ఈ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించనున్నారు. గుండె వ్యాధి, మానసిక సమస్యలు, డయాబెటిస్ కు సంబంధించిన పరీక్షలు చేయనున్నారు. అలాగే అవసరమైన వారికి మెమోగ్రఫీ, ఛాతి ఎక్సరే లు కూడా చేయనున్నట్లు వారి బృందం తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com