Warangal : పోలీసులు విచారణకు పిలిచారని యువకుడి ఆత్మహత్య

దొంగతనం కేసులో విచారణకు వచ్చిన యువకుడు పోలీస్‌స్టేషన్ ఆవరణలోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం వరంగల్ జిల్లాలో కలకలం సృష్టించింది. యువకుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా చికిత్స పొందుతూ చనిపోయాడు. వివరాల్లోకి వెళ్తే, ఫిబ్రవరి 28న గీసుకొండ మండలం శాయంపేటలోని ఓ ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో అదే గ్రామానికి చెందిన పోలం వంశీని గీసుకొండ పోలీసులు విచారణకు పిలిచారు.
ఈ చోరీతో తనకు ఎలాంటి సంబంధం లేదన్న మనస్తాపంతో వంశీ కూల్‌డ్రింక్‌లో పురుగుమందు కలుపుకొని తాగినట్లు తెలుస్తోంది. పోలీసులు విచారణ పేరుతో విచారణకు పిలవడం వంశీ అవమానంగా భావించినట్లు స్థానికులు అంటున్నారు. చోరీ జరిగిన ఇంటి యజమాని చెప్పడం వల్లే పోలీసులు వంశీని విచారణకు పిలిచారని బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే వంశీ ఆత్మహత్యకు తమకు ఎలాంటి సంబంధంలేని పోలీసులు అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com