Warangal Airport: కొచ్చి తరహాలో మామునూరు ఎయిర్‌పోర్టు

Warangal Airport: కొచ్చి తరహాలో మామునూరు ఎయిర్‌పోర్టు
X
భూ సేకరణ త్వరగా పూర్తి చేయాలన్న రేవంత్... మంత్రులు, అధికారులతో సమీక్ష

కేరళలోని కొచ్చి ఎయిర్‌పోర్టు మాదిరిగా వరంగల్‌ జిల్లా మూమునూరు విమానాశ్రయాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన నేపథ్యంలో... మామునూరు ఎయిర్‌పోర్టుపై సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. దీనికి మంత్రులు సీతక్క, కొండా సురేఖ, కోమటిరెడ్డి హాజరయ్యారు. ఎయిర్‌పోర్టు భూసేకరణ, పెండింగ్‌ పనులపై సీఎం ఆరా తీశారు. అసంపూర్తిగా ఉన్న భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని, వరంగల్‌కు ఎస్సెట్‌గా ఎయిర్‌పోర్టు నిర్మాణం ఉండాలని సూచించారు. కొచ్చి తరహాలో ఈ ఎయిర్‌పోర్టు ఉండాలని, ప్రతి నెలా ప్రోగ్రెస్‌ రిపోర్టు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఎయిర్‌పోర్టు భూసేకరణ, పెండింగ్‌ పనులకు సంబంధించి అధికారులను వివరాలు అడిగారు. నిత్యం యాక్టివిటీ ఉండేలా ఎయిర్‌పోర్టు డిజైన్‌ చేయాలన్నారు. అసంపూర్తిగా ఉన్న భూసేకరణ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, సత్వరమే ఎయిర్‌పోర్టు డిజైన్‌ను రూపొందించాలని ఆదేశించారు.

వరంగల్ నగర ఆస్తిగా ఎయిర్ పోర్ట్

యిర్‌పోర్టు వద్ద నిత్యం కార్యకలాపాలు ఉండేలా డిజైన్‌ చేయాలన్నారు. విమాన రాకపోకలతోపాటు ఇతర కార్యకలాపాలు ఉండేలా, వరంగల్‌ నగరానికి ఒక ఆస్తిగా విమానాశ్రయాన్ని తీర్చిదిద్దాలని చెప్పారు. ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ ప్రతి నెలా తనకు ప్రోగ్రెస్‌ రిపోర్టు పంపించాలని అధికారులను ఆదేశించారు.

ఘనతపై కొట్లాట

మామునూరు విమానాశ్రయం వద్ద బీజేపీ, కాంగ్రెస్‌ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. విమానాశ్రయ అభివృద్ధి ఘనత మాదంటే.. మాదని చెప్పుకొనేందుకు ఇరుపార్టీల నాయకులు పోటీపడ్డారు. బీజేపీ నాయకులు ప్రధాని మోదీ చిత్రపటానికి పుష్పాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమం చేపట్టారు. అదే సమయంలో కాంగ్రెస్‌ శ్రేణులు సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్రాలు ఉన్న ఫ్లెక్సీతో అక్కడికి చేరుకొని నినాదాలు చేశారు. క్షీరాభిషేకం చేసేందుకు ప్రయత్నించారు. దీంతో బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. తాము ఏర్పాటు చేసుకున్న వేదిక వద్ద మీరెలా కార్యక్రమం నిర్వహిస్తారంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.

Tags

Next Story