శభాష్ పోలీసన్న.. పేదరాలికి సొంతిల్లును గిఫ్ట్ గా ఇచ్చిండు!

తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ పోలీసు అధికారి తన ఉదారతను చాటుకున్నాడు. పేదరాలికి సొంతిల్లు కట్టించి కొత్త సంవత్సరం సందర్భంగా ఆ ఇల్లునే బహుమతి అందించాడు. ఇటీవల కురిసిన వర్షాలకు వరంగల్ జిల్లా పాలకుర్తిలో ఓ నిరుపేద మహిళ ఇళ్లు కూలిపోయింది. విషయం తెలుసుకున్న పాలకుర్తి ఎస్‌ఐ గుండ్రాతి సతీష్ తన గొప్పమనసుతో ఆమెకు ఇల్లు నిర్మించి ఇచ్చాడు. కొత్త సంవత్సరం రోజున గృహ ప్రవేశం చేసిన ఆమె ఆనందానికి అవధుల్లేవు. ఈ విషయాన్ని తెలంగాణ పోలీసు అధికారులు ట్వీట్ చేశారు. ఎస్‌ఐ గుండ్రాతి సతీష్ ను నెటిజన్లు కూడా అభినందిస్తున్నారు.
#WarangalPolice #Palakurthy SI Gundrathi Satish build a house for the old woman as New year's gift which collapsed during rains in monsoon. @cpwrlc pic.twitter.com/uYRxJNJa1n
— Telangana State Police (@TelanganaCOPs) January 1, 2021
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com