నిండు కుండలా మారిన శ్రీపాద ఎల్లంపల్లి పాజెక్టు ..!

పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి పాజెక్టు నిండు కుండలా మారింది. 35 గేట్లు ఎత్తి 2లక్షల 50వేల 490 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. గోదావరి ఎగువన భారీ వర్షాలు కురవటంతో కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీరు వదిలారు. ఎగువ నుంచి లక్షా 57వేల 879 క్యూసెక్కుల వరద ప్రవాహంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటిమట్టం భారీగా పెరిగింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 19.45 టీఎంసీలుగా ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద నీటి మట్టాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు ఆనకట్ట, దిగువ గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేస్తూ... ఎవరూ నదీ తీరం వద్దకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. గంటకోసారి సైరన్ మోగిస్తూ మత్స్యకారుల్ని అప్రమత్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com