వ్యవసాయం వల్లే కోలుకున్నాం ; వెంకయ్యనాయుడు
దేశ ఆర్థిక వ్యవస్థ నిలదొక్కునేందుకు వ్యవసాయ రంగమే కారణమని రైతులను కరోనా వారియర్స్ జాబితాలో చేర్చాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. హైదరాబాద్ అమీర్‌పేట్ సెస్ ఆడిటోరియంలో మాజీ ఐఏఎస్ అధికారి మోహన కందా రచించిన భారత వ్యవసాయ రంగం... రైతుల ఆదాయం రెట్టింపులో సవాళ్ళు అనే పుస్తకాన్నివెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. దేశంలో సగం మంది వ్యవసాయం ఆధారంగానే జీవనంసాగిస్తున్నాని... లాభసాటిగా లేకపోవడం వల్లే రైతులు వ్యవసాయాన్ని వీడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు . కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఏటా వ్యవసాయరంగంపై వేల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడుతున్నా...రైతుల జీవితాల్లో మార్పులు రావడం లేదన్నారు.
Improvement of road infrastructure, storage and warehousing facilities, crop diversification, food processing can put agriculture on to a more viable, income-generating trajectory. #agriculture pic.twitter.com/6Z8yuySyma
— Vice President of India (@VPSecretariat) March 31, 2021
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com