Sircilla: చేనేత కార్మికుల ప్రతిభ.. పరిమళించే పట్టుచీరలు, వస్త్రాలపై చిత్రాలు..

Sircilla: చేనేత కార్మికుల ప్రతిభ.. పరిమళించే పట్టుచీరలు, వస్త్రాలపై చిత్రాలు..
Sircilla: సిరిసిల్ల పట్టణంలో నేత కార్మికులు తమ ప్రతిభను మరోసారి చాటుకున్నారు.

Sircilla: సిరిసిల్ల పట్టణంలో నేత కార్మికులు తమ ప్రతిభను మరోసారి చాటుకున్నారు. అద్బుతమైన ప్రతిభతో అందరిని ఆకట్టుకుంటున్నారు. నెహ్రూనగర్‌కు చెందిన వెల్లి హరిప్రసాద్ మరమగ్గాలపై వినూత్నంగా రాష్ట్రప్రభుత్వం అతిత్వరలో చేపట్టనున్న జీవిత బీమా పథకం గురించి బట్టపై నేసి అబ్బుర పరిచారు. అంతేకాదు.. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రికేటీఆర్ చిత్రపటాలను కూడా ఆ బట్టపై రూపొందించి తన ప్రతిభను చాటుకున్నాడు. అందులో నేతన్నల బీమా గురించి కూడా మరమగ్గంపై నేచి ఆకట్టుకున్నాడు.

గతంలో హరిప్రసాద్ అగ్గిపెట్టెలో ఇమిడే రాట్నం, చీరను కూడా నేశాడు. దీంతో పాటు ఉంగరం,దబ్బనములో దూరే చీరను కూడా నేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. సిరిసిల్లకు చెందిన మరో చేనేత కళాకారుడు నల్లవిజయ్ పరిమళించే పట్టుచీరను రూపొందించి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఈ చీరలో 27 రకాల సుగంధ ద్రవ్యాలను ఉపయోగించి నేచినట్లు తెలిపాడు. దీనిని ఉతికినా కూడా ఏడాదిపాటు సుగంద పరిమళాలు వెదజల్లుతుందని ఆయన అంటున్నారు.

ఈ చీరను తయారు చేయడానికి నాలుగు రోజులు సమయం పట్టిందన్నారు. ఈ చీర తయారీలో శ్రీగంధం, నాగకేసరాలు, బిల్వగుజ్జు, పాల సుగంధి, జాపత్రి, జాజీకాయ, ఇలాచీ, జటమాసం, విరజాజీ, కుంకుమపువ్వు, ఇలా మొత్తం 27 రకాల సుగంధద్రవ్యాలు వాడామన్నారు. గతంలో ఉంగరం, దబ్బనంలో పట్టే చీరను తయారుచేసి కేసీఆర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నట్లు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story