Ice Cream: హైద‌రాబాద్‌లో విస్కీ ఐస్‌క్రీమ్‌.. అలవాటు పడితే అంతే మరి

Ice Cream: హైద‌రాబాద్‌లో విస్కీ ఐస్‌క్రీమ్‌.. అలవాటు పడితే అంతే మరి
0 గ్రాముల ఐస్‌క్రీమ్‌లో 100 ఎంఎల్ విస్కీ క‌లిపి విక్ర‌యిస్తున్న పార్ల‌ర్ నిర్వాహ‌కులు

నిన్న మొన్నటి వరకు చాక్లెట్ రూపంలో గంజాయి అమ్మకం విన్నాం అయితే ఇప్పుడు మత్తుపదార్థాలను విక్రయిస్తోన్న ముఠాలు ఐస్‌క్రీమ్ రూపంలో మత్తును ఎవరికీ అనుమానం రాకుండా యువతకు అలవాటు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో విస్కీ ఐస్‌క్రీమ్‌లు దందా వెలుగులోకి వచ్చింది. జూబ్లీహిల్స్‌లోని ఓ పార్లర్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహించడంతో ఈ ఐస్‌క్రీమ్‌ల గుట్టురట్టయ్యింది. రోడ్డు నెంబరు 1 లో వన్‌ అండ్‌ ఫైవ్‌ పార్లర్‌లో ఎక్సైజ్‌ పోలీసులు సోదాలు నిర్వహించగా.. విస్కీ ఐస్‌క్రీమ్‌లు బయటపడ్డాయి. ఐస్‌క్రీమ్‌లో పేపర్ విస్కీ కలిపి అమ్ముతున్నట్టు గుర్తించారు. జూబ్లీహిల్స్‌లోని వన్ అండ్ ఫైవ్ ఐస్‌క్రీమ్ పార్ల‌ర్‌పై జ‌రిపిన దాడుల్లో ఐస్‌క్రీమ్‌లో విస్కీ క‌లిపి అమ్ముతున్న‌ట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. 60 గ్రాముల ఐస్‌క్రీమ్‌లో 100 ఎంఎల్ విస్కీ క‌లిపి విక్ర‌యిస్తున్న‌ట్లు అధికారులు క‌నుగొన్నారు.

ఈ ఐస్‌క్రీమ్‌ల‌ను పిల్ల‌లు, యువ‌త భారీ మొత్తంలో కొనుగోలు చేస్తున్న‌ట్లు పోలీసుల‌కు తెలిసింది. దీంతో త‌నిఖీలు నిర్వ‌హించి ఐస్‌క్రీమ్ పార్ల‌ర్ య‌జ‌మానులు ద‌యాక‌ర్ రెడ్డి, శోభ‌న్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. న‌గ‌రంలో వీరికి ఇంకా ఎన్ని ఐస్‌క్రీమ్ పార్ల‌ర్లు ఉన్నాయి, ఇప్ప‌టివ‌ర‌కూ జ‌రిగిన విక్ర‌యాలు ఎన్ని? అన్నదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.

హైదరాబాద్‌లో డ్రగ్స్ కట్టడికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో ముఠాలు కొత్తదారులు వెదుకుతున్నాయి. ఇందులో భాగంగానే ఎవరికీ అనుమానం రాకుండా చాక్లెట్లు, ఐస్‌క్రీమ్‌ల రూపంలో ఇలా డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నాయి. పబ్‌లపై కూడా నిఘా పెరగడంతో పెడ్లర్లు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

గత నెలలో కిరాణాకొట్టులో గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్న వ్యక్తిని సైబరాబాద్‌ స్పెషల్‌ ఆపరేషన్‌ టీం (ఎస్‌ఓటీ) పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లోని గోహ్నియాకి చెందిన పివేస్‌ అలియాస్‌ ప్రైవేష్‌ బతుకుదెరువు కోసం కొన్నేళ్ల కిందట హైదరాబాద్‌కు వచ్చి.. ఐడీపీఎల్‌ బాలానగర్‌లో నివాసం ఉంటున్నారు. పేట్‌ బషీరాబాద్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని సుభా నగర్‌లో కిరాణా షాపు నడుతున్న అతడికి.. ఆశించిన మేర ఆదాయం లేకపోవడంతో గంజాయి విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. దీతో యూపీ నుంచి అక్రమంగా గంజాయి చాక్లెట్లను నగరానికి తీసుకొచ్చి స్కూల్, కాలేజీ విద్యార్థులు, యువత, దినసరి కూలీలకు విక్రయిస్తున్నాడు.

Tags

Next Story