ఎవరీ నోముల భగత్.. ఫుల్ డీటెయిల్స్ ఇవే...!

నాగార్జున సాగర్ నియోజకవర్గ ఉపఎన్నికకు టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది. దివంగత నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్‌కు టీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్.. భగత్‌కు బీఫామ్ అందజేశారు. అలాగే పార్టీ ప్రచారం కోసం 28 లక్షల చెక్‌ను కూడా అందించారు. రేపు ఉదయం నోముల భగత్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. నోముల భగత్ గెలుపుకు కృషి చేయాలని పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
ఇక 1984లో నోముల భగత్ జన్మించారు. 2007లో బీటెక్ పూర్తి చేసిన భగత్.. కొంతకాలం సాఫ్ట్ వేర్ ఇంజననీర్‌గా పనిచేశారు. అనంతరం 2010లో ఎంబీఏ పూర్తి చేశారు. 2010 నుంచి 2012 వరకు విస్టా ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేశారు. ఉద్యోగంతో పాటు 2014లో భగత్ కుమార్ లా కూడా చదివారు. అనంతరం 2014 నుంచి 18 మధ్య హైకోర్టులో అడ్వకేట్‌గా భగత్ ప్రాక్టీస్ చేశారు. 2016లో భగత్ ఎల్ఎల్ఎం పూర్తి చేశారు.
పేరు: నోముల భగత్ కుమార్
తండ్రి: దివంతగ నోముల నర్సింహయ్య
తల్లి: నోముల లక్ష్మి
భార్య: నోముల భవానీ
పిల్లలు: కుమారుడు, కుమార్తె
పుట్టిన తేది: అక్టోబర్ 10, 1984
చదువు: BE, MBA, LLB, LLM
ఉద్యోగ అర్హతలు:
సత్యం టెక్నాలజీస్ లిమిటెడ్ లో జూనియర్ ఇంజనీర్,
విస్టా ఫార్మా స్యూటికల్స్ లిమిటెడ్ లో మేనేజర్ గా బాధ్యతలు,
ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు న్యాయవాదిగా విధులు
రాజకీయ అనుభవం: 2018 ఎన్నికల్లో నాగార్జున సాగర్ నియోజకవర్గ ఆర్గనైజర్
సివిల్ ప్రొఫైల్: నోముల ఎన్.ఎల్ ఫౌండేషన్ చైర్మన్
ఇక మరోవైపు నాగార్జున సాగర్‌లో టికెట్ ఆశించి భంగపడ్డ అసంతృప్తవాదులను కేసీఆర్ బుజ్జగించారు. ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, మరో నేత కోటిరెడ్డి కూడా సాగర్ టికెట్ ఆశించారు. అయితే పార్టీ శ్రేణుల మనోభావాలకు తోడు నోముల నర్సింహయ్య పార్టీకి అందించిన సేవలకు గుర్తింపుగా ఆయన వారసునికి అవకాశం ఇవ్వడం మేలని భావించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. భగత్‌కు టికెట్‌ను ఖరారు చేశారు. ఇక టికెట్ ఆశించి భంగపడ్డ కోటిరెడ్డికి సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. అటు తేరా చిన్నపరెడ్డికి మరోసారి రెన్యూవల్ చేస్తానని హామీ ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com