TS: తెలంగాణ బీజేపీ అధ్యక్ష పోరు రసవత్తరం

TS: తెలంగాణ బీజేపీ అధ్యక్ష పోరు రసవత్తరం
X
ముగ్గురి పేర్లు పరిశీలిస్తున్న హై కమాండ్‌.. కాషాయ దళంలో ఉత్కంఠ

తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసులో ముగ్గురు నేతలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈటల రాజేందర్, డీకే అరుణ, రామచంద్రరావు పేర్లు ఉన్నట్లు సమాచారం. అయితే.. హైకమాండ్ మహిళా కోటాలో డీకే అరుణ పేరు పరిశీలిస్తున్నట్లు కూడా పలువురు చెబుతున్నారు. ఈ ముగ్గురి పేర్ల పరిశీలించిన తర్వాత త్వరలోనే కొత్త అధ్యక్షుడిని మోదీ, అమిత్ షా ఫైనల్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సారి తనకు ఛాన్స్‌ ఇవ్వాలంటూ రామచంద్రరావు బీజేపీ పెద్దల్ని కలిశారు. పార్టీలో మొదట్నుంచి ఉండడం, ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతుతో.. అధ్యక్ష పదవి కోసం రామచంద్రరావు ప్రయత్నాలు చేస్తున్నారు. సునీల్‌ బన్సల్‌, బీఎల్ సంతోష్‌ సహా ముఖ్యనేతలతో.. ఇప్పటికే అధ్యక్ష పదవి ఆశిస్తున్న నాయకులు సమావేశమయ్యారు.

డీకే అరుణ పేరే ఫైనలా..?

హైకమాండ్ మహిళా కోటాలో డీకే అరుణ పేరు పరిశీలిస్తున్నట్లు కూడా చెబుతున్నారు. రెడ్డి సామాజికవర్గ సమీకరణాలు డీకే అరుణకు ప్లస్‌ పాయింట్స్ గా చెబుతున్నారు.. ముగ్గురిలో రేసులో ఈటల రాజేందర్‌ ముందున్నట్లు చెబుతున్నారు. తెలంగాణలో బీసీ నినాదం వినిపించేందుకు ఈటల ఆప్షన్ అని.. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఈటలకు ప్లస్‌ పాయింట్‌ అవుతుందని చెబతున్నారు. అయితే.. షార్ట్ లిస్ట్ లో ఉన్న పేర్లను పరిశీలించిన తర్వాత త్వరలోనే కొత్త అధ్యక్షుడిని మోదీ, అమిత్ షా ఫైనల్ చేయనున్నట్లు చెబుతున్నారు.

తెలంగాణలో బీజేపీ కొత్త కూటమి..!

మరోవైపు ఏపీలో NDA కూటమి జత కట్టినప్పుడల్లా ఘన విజయమే సాధించింది. 2014, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే రుజువైంది. తాజాగా ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. తెలంగాణలోనూ NDA కూటమిని విస్తరించాలని ప్రతిపాదించారట. దీనికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరూ అంగీకరించినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో అధికార పీఠం అందుకోవాలని భావిస్తున్న BJPకి.. ఈ ప్లాన్ వర్కౌట్‌ అవుతుందా లేదా అనేది చూడాలి.

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్టీఆర్?

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరన్న చర్చలు జరుగుతున్న తరుణంలో స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వస్తోంది. గతంలో అమిత్ షాతో ఎన్టీఆర్ భేటీ అయ్యారు. అప్పటి నుంచి ఆయనతో ఎన్టీఆర్ టచ్‌లో ఉన్నట్లు బీజేపీ శ్రేణులు చెబుతున్నారు. కాగా, ఏపీలో పొత్తులో ఉన్న బీజేపీ తన మార్క్‌ని చూపించుకోవాలని.. అందుకోసమే ఫేమ్ ఉన్న ఎన్టీఆర్‌ని బరిలోకి దింపాలని చూస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags

Next Story