సీన్ రివర్స్.. అత్తింటి వేధింపులు.. అల్లుడు ఆత్మహత్య

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ విషయం నచ్చని అమ్మాయి అమ్మానాన్న వేధింపులకు గురిచేశారు.. దాంతో తీవ్ర మనస్థాపం చెందిన అతడు ఆత్మహత్యకు పాల్సడ్డాడు. అత్తింటి వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డ వ్యక్తి మంచిర్యాలకు చెందిన చెన్నవేని వెంకటేశ్(28).. అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లై ఆరేళ్లయినా భార్య తల్లిదండ్రులు, అన్నదమ్ములు, మేనత్త వెంకటేశ్‌ని నిత్యం వేధించేవారు. ఈ విషయంపై పలుమార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ కూడా జరిగింది.
పోలీస్ స్టేషన్లో సైతం వెంకటేశ్ ఫిర్యాదు చేశాడు. పోలీసులు సర్ధిచెప్పినా అత్తమామల తీరులో మార్పు లేదు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి గొడవ జరిగింది. వెంకటేశ్‌పై అత్తమామలు చేయి చేసుకున్నారు. దీంతో తీవ్రమనస్థాపానికి గురైన వెంకటేశ్ ఊరి చెరువు దగ్గరకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకు కారకులైన అత్తమామలను కఠినంగా శిక్షించాలని వాయిస్ రికార్డు చేసి తన కుటుంబ సభ్యులకు మెసేజ్ పెట్టాడు.
కుటుంబసభ్యులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని వెంకటేశ్‌ని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం వెంకటేశ్ మరణించాడని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com