నాగార్జున సాగర్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పోటీ చేస్తుందా?

నాగార్జున సాగర్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పోటీ చేస్తుందా? కాంగ్రెస్ నేత బెల్లయ్య నాయక్ మాటలతో ఈ ప్రశ్న ఉత్పన్నమైంది. సాగర్‌లో పోటీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని బెల్లయ్య నాయక్ టీవీ5 న్యూస్ స్కాన్‌లో స్పష్టం చేశారు. ఇటీవల అనారోగ్యంతో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతి చెందడంతో నాగార్జున సాగర్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఐతే.. ఎమ్మెల్యే అనారోగ్యంతో మృతి చెందితే.. అభ్యర్థిని నిలబెట్టొద్దనేది కాంగ్రెస్ సంప్రదాయమని బెల్లయ్య నాయక్ తెలిపారు. కాంగ్రెస్ సీనయిర్ నేత.. గతంలో సాగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన జానారెడ్డితో సంప్రదించాకే పోటీపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. జానారెడ్డి నిర్ణయానికి పార్టీ విలువిస్తుందని.. అంతా ఆయన నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని బెల్లయ్య నాయక్ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com