ఆ రెండు రోజులూ వైన్‌షాపులు బంద్..!

ఆ రెండు రోజులూ వైన్‌షాపులు బంద్..!
హైదరాబాదు, సికింద్రాబాద్ జంటనగరాల్లోని వైన్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలు బంద్ పాటించాల్సిందగా హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు.

హోలీ సందర్భంగా మందుబాబులకు షాకిచ్చారు హైదరాబాద్ పోలీసులు..మార్చి 28 సాయింత్రం ఆరు గంటల నుంచి మార్చి 30 సాయింత్రం ఆరు గంటల వరకు హైదరాబాదు, సికింద్రాబాద్ జంటనగరాల్లోని వైన్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలు బంద్ పాటించాల్సిందగా హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా పండగ పూట.. అసౌకర్యం కలిగించడం, రోడ్లపై రంగులు చల్లడం, గుంపులుగా వాహనాలపై తిరగడం వంటి తదితర చర్యలను నిషేధిస్తూ మరో ప్రత్యేక ఉత్తర్వులు వెలువరించారు. ఎవరైనా ఈ చర్యలను ఉల్లంఘించినైట్లెతే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story