బుద్వేల్ భూములకు రెక్కలు.. హెచ్ఎండిఏ ద్వారా విక్రయం

బుద్వేల్ భూములకు రెక్కలు.. హెచ్ఎండిఏ ద్వారా విక్రయం
హైదరాబాద్ నగరం విస్తరిస్తోంది. అవుటర్ రింగ్ రోడ్డు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల భూముల ధరలకు రెక్కలు వచ్చాయి.

హైదరాబాద్ నగరం విస్తరిస్తోంది. అవుటర్ రింగ్ రోడ్డు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఎకరా భూమి ధర కోట్లలో పలుకుతోంది. ఇప్పటికే కోకాపేటలో ఎకరా రూ.100 కోట్లకు చేరుకుంది. ఈ క్రమంలో బుద్వేల్ భూముల అమ్మకానికి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్ లో బహుళ ప్రయోజన నిర్మాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేసి 100 ఎకరాల స్థలాన్ని హెచ్ఎండిఏ ద్వారా విక్రయించనున్నారు.

బుద్వేల్ లో మొత్తం 14 ప్లాట్లను అమ్మకానికి ఉంచారు. ఒక్కో ప్లాటు విస్తీర్ణం 3.47 ఎకరాల నుంచి 14.33 ఎకరాల వరకు ఉంది. ఎకరాకు రూ.20 కోట్ల కనీస ధరను నిర్ణయించారు. ఆరో తేదీన ప్రీబిడ్ సమావేశం, 8 సాయింత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్ సౌకర్యం ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ నెల 10న ఈ వేలం నిర్వహిస్తామని అన్నారు. ఇక్కడ భూమి ఎకరా సగటున రూ.30 కోట్ల ధరకు అమ్ముడుపోయినా.. ప్రభుత్వానికి కనీసం రూ.3 వేల కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

పెద్ద పెద్ద కంపెనీలు పోటీ పడి మరీ తెలంగాణ భూములను కొనుక్కుంటున్నారని, ఇది రాష్ట్ర ప్రభుత్వ ప్రగతికి నిదర్శనమయి సీఎం కేసీఆర్ అంటున్నారు.. తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని అన్నారు..



Tags

Read MoreRead Less
Next Story