కాళేశ్వరం నీళ్ల రాకతో యాసంగిలో అదనంగా 60వేల ఎకరాల పంట : హరీష్‌రావు

కాళేశ్వరం నీళ్ల రాకతో యాసంగిలో అదనంగా 60వేల ఎకరాల పంట : హరీష్‌రావు
X
కాళేశ్వరం నీళ్ల రాకతో యాసంగిలో అదనంగా 60వేల ఎకరాల పంట పండుతోందని మంత్రి హరీష్‌రావు చెప్పారు..

కాళేశ్వరం నీళ్ల రాకతో యాసంగిలో అదనంగా 60వేల ఎకరాల పంట పండుతోందని మంత్రి హరీష్‌రావు చెప్పారు.. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం గుర్రాలగొందిలోని రేణుకా ఎల్లమ్మ, జమదగ్ని కల్యాణ మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు హరీష్‌రావు. కాళేశ్వరం ప్రాజెక్టు రంగనాయక సాగర్‌తో పల్లెల్లోని చెరువులు, కుంటలన్నీ నిండు కుండలా మారాయని చెప్పారు. మండుటెండల్లో గుర్రాలగొంది గ్రామ చెరువు మత్తడి దూకుతోందని.. ప్రజలంతా సంతోషంతో ఉన్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కోసం ఐదెకరాల భూమిని గ్రామస్తులు కోరగా.. త్వరలోనే ఇచ్చే ఏర్పాట్లు చేస్తానని మంత్రి హరీష్‌రావు హామీ ఇచ్చారు.

Next Story