తెలంగాణ హైకోర్టులో కవిత ఆనే మహిళ ఆత్మహత్యాయత్నం
By - Nagesh Swarna |6 Oct 2020 8:54 AM GMT
తెలంగాణ హైకోర్టులో ఓ మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం రేపింది. చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న కేసులో తీర్పు రాకపోవడంతో నిరాశలో ఆత్మహత్యకు యత్నించినట్టు సమాచారం. హైకోర్టు మొదటి అంతస్థు నుంచి దూకేందుకు ప్రయత్నించింది. సమయానికి అక్కడే ఉన్న కోర్టు సెక్యూరిటీ సిబ్బంది ఆమెను కాపాడారు. బాధితురాలి స్వస్థలం గోదావరి ఖని. ఏప్రిల్ 11న మురళి అనే వ్యక్తి అత్యాచారం చేశాడని ఆమె ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఆ కేసు నడుస్తోంది. ఆత్మహత్యాయత్నం చేసిన మహిళను సెక్యూరిటీ కార్యాలయంలో కూర్చోబెట్టి అధికారులు విచారిస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com