హాట్సాఫ్ : మానవత్వం చాటుకున్న మహిళా కానిస్టేబుళ్లు!

Women constables expressing humanity
మానవత్వం చాటి మిగతా వారికి ఎంతో ఆదర్శంగా నిలిచారు ఇద్దరు మహిళ పోలీసులు. నాచారం పోలిస్ స్టేషన్ పరిధిలో స్వాతి అలియాస్ మహేశ్వరీ(21)అనే ఓ మహిళ మతిస్థిమితం సరిగ్గా లేక శిశువుతో రోడ్లపై తిరుగుతూ, రాళ్ళను విసురుతూ ప్రజలను ఇబ్బందికి గురిచేస్తోంది. ఆమె మతిస్థిమితం బాలేకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు కూడా ఆమెను పక్కనపెట్టేశారు.
ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న నేపధ్యంలో స్వాతి పైన కేసు నమోదు చేశారు నాచారం పోలీసులు. ఆ తర్వాత ఆమెను ఎర్రగడ్డలోని మానసిక వైద్యశాలలో చేర్చారు. ఇక శిశువును శిశువిహార్‌లో చేర్పించారు. అయితే శిశువును శిశువిహార్‌కు అప్పగించే వరకు నాచారం మహిళా కానిస్టేబుళ్లు తగిన సహకారం అందించారు. పాల డబ్బాలను తెప్పించి ఆ శిశువుకు పాలు పట్టించారు.
ఆలాగే ఉప్పల్ ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద రోడ్డు దాటడానికి ఇబ్బంది పడుతున్న ఓ వృద్ధుడికి ట్రాఫిక్ మహిళా కానిస్టేబుల్ కుమారి సంధ్య సహాయం చేసింది. ఉప్పల్ రింగ్‌రోడ్డులో ఈ మహిళా కానిస్టేబుల్ చేస్తున్న సేవలను ఉన్నతాధికారులు ప్రశంసించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com