Women's Day 2023: ఉమెన్స్ డే సందర్భంగా నెక్లెస్‌రోడ్‌లో 5కే, 2కే రన్

ఉమెన్స్ డే సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లో 5కే, 2కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎస్,డీజీపీ, అడిషనల్ డీజీ శిఖా గోయల్,సీవీ అనంద్ హాజరై జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలకు కు విషెష్ చెప్పారు సీఎస్ శాంతికుమారి. దేశంలోనే షీ టీమ్స్ నెం.1 గా ఉందన్నారు.ఇతర రాష్ట్రాలు షీ టీమ్స్‌ను ఆదర్శంగా తీసుకుంటున్నాయని రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్.
ఇక షీ టీమ్స్ ఏర్పాటుతో మహిళలు ఆపదలో ఉన్న సమయాల్లో నిమిషాల్లోనే వారికి సాయం అందుతోందన్నారు. మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళా లోకానికి అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. వివిధ కళాశాలకు చెందిన విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 5కే రన్ పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభమై ట్యాంక్‌బండ్ పైనున్న లేపాక్షి వరకు సాగి, తిరిగి ప్రారంభమైన చోటే ముగిసింది. 2కే రన్ నెక్లెస్ రోడ్డు వరకు కొనసాగింది. ఈ రన్‌లో పాల్గొన్న వారికి అవార్డులు, మెడల్స్ ప్రదానం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com