Nizamabad: మాక్లూర్‌ బాలల సంరక్షణ కమిటీ సమావేశంలో రసాభాస

Nizamabad: మాక్లూర్‌ బాలల సంరక్షణ కమిటీ సమావేశంలో రసాభాస
నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌ బాలల సంరక్షణ కమిటీ సమావేశం రసాభాసగా మారింది

నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌ బాలల సంరక్షణ కమిటీ సమావేశం రసాభాసగా మారింది. సమావేశంలో జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ విఠల్‌ రావు, ఎంపీపీ ప్రభాకర్‌ మధ్య వాగ్వాదం నెలకొంది. ఎంపీపీ ప్రభాకర్ సమావేశానికి ఆలస్యంగా రావడంతో వివాదం చెలరేగింది. ఎంపీపీ తీరుపై జడ్పీ ఛైర్మన్‌ ఆగ్రహం చేవారు. దీంతో నువ్వేంత అంటే నువ్వేంత అంటూ ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. అధికారుల ముందే ఇద్దరు తిట్టుకున్నారు. ఇద్దరు బీఆర్ఎస్ నేతలే కావడంతో మిగతా సభ్యులు అవాక్కైయ్యారు.

Tags

Next Story