సీఎల్పీ నేత భట్టి విక్రమార్క భార్య నందినికి పెట్రోల్ బంక్ సిబ్బంది టోకరా

సామాన్యులనే కాదు.. ప్రజాప్రతినిధులను సైతం పెట్రోల్ బంకు సిబ్బంది మోసం చేస్తున్నారు. తాజాగా ఖమ్మం జిల్లా వైరాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సతీమణి నందిని.. లక్ష్మీపురంలో రామలింగేశ్వర స్వామిని దర్శించుకొని తిరుగుప్రయాణంలో వైరాలో ఆగారు. వాహనాల్లో డీజిల్ కొట్టించుకోవడానికి పాత బస్టాండ్ సెంటర్‌లో ఉన్న HP పెట్రోల్ బంక్‌కు వచ్చారు.
ముందుగా నందిని ప్రయాణిస్తున్న వాహనంలో బంక్ సిబ్బంది డీజిల్ కొట్టారు. అయితే వాహనంలో డీజిల్ పడకుండానే సిబ్బంది నగదు రిసిప్ట్ ఇవ్వడంతో నందిని అవాక్కయ్యారు.
ఈ ఘటనపై జిల్లా సివిల్ సప్లయ్ అధికారులకు ఆమె ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు బంకు వద్ద ఆందోళన చేసేందుకు సిద్ధమవడంతో.. రెవెన్యూ, సివిల్ సప్లయ్ అధికారులు బంకును పరిశీలించి కేసు నమోదు చేశారు. వాహనదారులను మోసం చేస్తున్న పెట్రోల్ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని నందిని కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com