Yadadri : కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు

Yadadri : కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు
ఫైర్ సెఫ్టీ లేకుండా పరిశ్రమలను నిర్వహిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలోని కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలింది. భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెంలోని సీవీఆర్ కెమికల్‌ కంపెనీలో సాల్వెంట్‌ను రీసైక్లింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చినా వారు సమయానికి రాలేకపోయారు. దీంతో పక్కన ఉన్న మరో కంపెనీకి చెందిన ఫైర్ వాహనంతో కార్మికులు మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో ఎవరికి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇదిలా ఉండగా.. తరుచూ అగ్ని ప్రమాదాలు జరుగుతుండడంతో సమీప గ్రామాలు భయాందోళన చెందుతున్నాయి. ఫైర్ సెఫ్టీ లేకుండా పరిశ్రమలను నిర్వహిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

Tags

Next Story