Yadagirgutta: 3న సంపూర్ణ చంద్రగ్రహణం.. యాదగిరి గుట్ట ఆలయం మూసివేత

Yadagirgutta: 3న సంపూర్ణ చంద్రగ్రహణం.. యాదగిరి గుట్ట ఆలయం మూసివేత
X
ఈ నెల 3న సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మూసి వేస్తున్నట్లు ఆలయ ఈవో భవానీ శంకర్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ నెల 3న సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిరి ఆలయాన్ని మూసివేస్తున్నట్టు ఆలయ ఈవో భవానీశంకర్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. చంద్రగ్రహణం కారణంగా ప్రధాన ఆలయంతో పాటు ఉప ఆలయాలు, అనుబంధ దేవాలయాలలో ఉదయం 7 గంటలలోపు సుప్రభాత సేవ, నిజాభిషేకం, అర్చనలు ముగించి మూసివేస్తామని వెల్లడించారు.

4వ తేదీన ఉదయం 3 నుంచి 5.30 గంటల వరకు ఆలయ ద్వారాలను తెరిచి సంప్రోక్షణ, ఆలయ శుద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం సుప్రభాతం, తిరువారాధన, బాలబోగం, ఆరగింపు, నిజాభిషేకం నిర్వహించి, భక్తుల దర్శనార్థం ఉదయం 8.45 గంటలకు యధావిధిగా ప్రారంభిస్తామని చెప్పారు. చంద్రగ్రహణం సందర్భంగా స్వామివారి సన్నిధిలో రేపు జరిగే హోలి ఉత్సవాన్ని 2వ తేదీ సాయంత్రం నిర్వహిస్తామని తెలిపారు.

Tags

Next Story