Yashwant Sinha: యశ్వంత్ సిన్హా సంచలన వ్యాఖ్యలు.. మోదీకి వ్యతిరేకంగా పోరాటం..
Yashwant Sinha: టీఆర్‌ఎస్ మద్దతిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపిన విపక్షా రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది దేశ భవిష్యత్ కోసం జరుగుతున్న పోరాటంగా అభివర్ణించిన యశ్వంత్ సిన్హా.. దేశంలో పరిస్థితులు దిగజారుతుంటే చూస్తూ ఉండలేమన్నారు. మోదీకి వ్యతిరేకంగా కేసీఆర్‌తో కలిసి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. దేశం కోసం జరిగే పోరాటంలో కేసీఆర్ నాయకత్వానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని యశ్వంత్ సిన్హా తేల్చిచెప్పారు. దేశ ప్రజల కోసం పిల్లల భవిష్యత్ కోసం కేసీఆర్‌తో పోరాట చేస్తామన్న యశ్వంత్ సన్హా.. పీపుల్స్ మూమెంట్ తెలంగాణ నుంచే ప్రారంభవుతుందని స్పష్టం చేశారు.
దేశంలో పరిస్థితులు దిగజారుతుంటే చూస్తూ ఉండలేమన్నారు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంచ్ సిన్హా. ఈసారి రాష్ట్రపతి ఎన్నికలు అసాధారణ పరిస్థితుల్లో జరుగుతున్నాయన్న యశ్వంత్ సిన్హా.. ఈ ఎన్నికలు ఇద్దరు వ్యక్తు మధ్య సమరం కాదన్నారు. రాష్ట్రపతి అభ్యర్థి ఏకగ్రీవం మీద ప్రధానికి నమ్మకం లేదని....ఈ ఎన్నిక ఏకగ్రీవం అయ్యే ఛాన్స్ ఉండికూడా ఆ ప్రయత్నం అధికార పక్షం చేయలేదన్నారు. ఉన్నతస్థాయి వ్యక్తులకు ఇలాంటి వైఖరి ఉండటం సరైందికాదని యశ్వంత్ సిన్హా అభిప్రాయపడ్డారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com