Yogi Adityanath: యోగి ఆదిత్యనాథ్ భాగ్యలక్ష్మి ఆలయ సందర్శన వాయిదా..

Yogi Adityanath: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ .. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయ సందర్శన వాయిదా పడింది. అనివార్య కారణాల వల్ల పాతబస్తీ పర్యటన వాయిదా పడిందని బీజేపీ వర్గాలు తెలిపాయి. రేపు భాగ్యలక్ష్మీ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేసే అవకాశం ఉంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ రావాల్సిన యోగి.. రాష్ట్ర బీజేపీ నేతల ఆహ్వానం మేరకు ఇవాళ పాతబస్తీలో పర్యటించాల్సి ఉంది.
యోగికి ఘనస్వాగతం చెప్పేందుకు బీజేపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు కూడా చేశారు. అయితే హైదరాబాద్‌కు యోగి రాక ఆలస్యమవడంతో భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లడం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి. గతంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ వచ్చిన యోగి.. హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మార్చాలని వ్యాఖ్యలు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com