గత ఏడాది మీరు ఇచ్చిన వాగ్ధానం మరిచిపోయారు: బోనాల్లో భవిష్యవాణి

సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా ఇవాళ రంగం నిర్వహించారు. ఈ సందర్భంగా జోగిని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ప్రజలు చేసే పూజలు సంతోషంగా అందుకుంటానని చెప్పారు. గత ఏడాది మీరు ఇచ్చిన వాగ్ధానం మరిచిపోయారన్నారు. మీకు కావల్సిన బలాన్ని ఇచ్చానని, మీ వెంటే ఉంటానని చెప్పారు. ఆలస్యమైనా వర్షాలు తప్పకుండా వస్తాయని అన్నారు.
అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన చెందవద్దు. నా వద్దకు వచ్చే ప్రజలను కాపాడే బాధ్యత నాదే అని అన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటానని అన్నారు. ఐదు వారాలు తప్పనిసరిగా నైవేద్యాలు సమర్పించాలి అని అన్నారు స్వర్ణలత. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా హాజరయ్యారు. భవిష్యవాణి వినేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. దాంతో సికింద్రాబాద్ వెళ్లే రూట్ అంతా జనంతో నిండిపోయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com