హ్యాట్సాఫ్ .. ఓటేసిన తర్వాతే పెళ్లిపీటలెక్కిన నవవధువు..!

X
By - TV5 Digital Team |14 March 2021 12:30 PM IST
మహబూబ్‌నగర్ జిల్లా మల్కాపూర్ గ్రామానికి చెందిన ఫిర్దోస్ బేగం పెళ్లి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో ఆదివారం ఉదయం 10గంటలకు ఏర్పాటు చేశారు.
కాసేపట్లో పెళ్లనగా.. ఓటు హక్కును వినియోగించుకొని అందరికీ ఆదర్శంగా నిలిచింది ఓ నవ వధువు... మహబూబ్‌నగర్ జిల్లా మల్కాపూర్ గ్రామానికి చెందిన ఫిర్దోస్ బేగం పెళ్లి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో ఆదివారం ఉదయం 10గంటలకు ఏర్పాటు చేశారు. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండడంతో ఆమె ఉదయం 8.30 నిమిషాలకి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంది. ఆ తర్వాత వెంటనే పెళ్లి కోసం ఫంక్షన్ హాలుకి బయలుదేరి వెళ్ళింది. ఎన్నికల సమయంలో సెలవు ఉన్నా.. కొందరు అందుబాటులో ఉన్నప్పటికీ చాలా చోట్ల ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేసేందుకు ఆసక్తి చూపడం లేదు కానీ... బాధ్యతగా తన ఓటు హక్కును వినియోగించుకొని అందరికీ ఆదర్శంగా నిలిచింది ఫిర్దోస్ బేగం..
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com