తెలంగాణ

వణికిస్తున్న విషజ్వరాలు.. డెంగ్యూతో యువ డాక్టర్ మృతి

వర్షాకాలం వస్తూనే వైరస్‌లను వెంటబెట్టుకుని వస్తుంది. ఎడతెరిపిలేని వర్షాలు.. దోమల బీభత్సంతో పౌరులు అస్వస్థతకు గురవుతున్నారు

వణికిస్తున్న విషజ్వరాలు.. డెంగ్యూతో యువ డాక్టర్ మృతి
X

వర్షాకాలం వస్తూనే వైరస్‌లను వెంటబెట్టుకుని వస్తుంది. ఎడతెరిపిలేని వర్షాలు.. దోమల బీభత్సంతో పౌరులు అస్వస్థతతకు గురవుతున్నారు. పలువురు వైరల్ జ్వరాల బారిన పడుతున్నారు. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటివి ప్రాణాలు తీస్తున్నాయి. డాక్టర్ వృత్తిలో ఉండి అన్ని జాగ్రత్తలు తాము తీసుకుంటూ పేషెంట్లకు చెబుతుంటారు. ఆయినా ఆ డెంగీ జ్వరం ఓ యువ డాక్టర్‌ని పొట్టన పెట్టుకుంది.

నిజామాబాద్‌కు చెందిన అర్పిత రెడ్డి (32) జీడిమెట్ల డివిజన్ మీనాక్షి ఎస్టేట్స్‌లో ఉంటూ స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 5 రోజుల క్రితం తీవ్రమైన జ్వరం రావడంతో నగరంలోని గ్లోబల్ ఆస్పత్రిలో చేర్పించగా డేంగీ అని తేలింది. చికిత్స పొందుతున్న ఆమె ఆదివారం కన్నుమూసింది. అర్పితకు పెళ్లై ఓ పాప ఉంది. ఓ డాక్టర్ ఈ విధంగా డెంగీతో మరణించడం స్థానికులను కలచివేసింది.

పారిశుద్ధ్య పర్యవేక్షణ సరిగా లేదని.. డాక్లర్ మరణంతో అధికారుల అలసత్వం కనిపిస్తుందని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. పలువురు మురికి వాడ ప్రాంత ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో డెంగీ కేసులు ఎక్కువవుతున్నాయి. ఇప్పటికే కరోనాతో సతమతమవుతున్న ప్రజలు విషజ్వరాలు సోకడం వలన ఆర్థిక ఇబ్బందులు సైతం ఎదుర్కోవాల్సి వస్తుంది. మీనాక్షి ప్రాంతానికి చెందిన మరో మహిళ డెంగీ జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రిలో ఐసీసీయూ బెడ్ మీద ఉంది. స్పింగ్ ఫీల్డ్ కాలనీకి చెందిన ఓ విద్యార్థిని ఇటీవల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.

Next Story

RELATED STORIES