యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రేమికుడు దారుణ హత్య

హైదరాబాద్ చందానగర్‌లో దారుణం జరిగింది. అవంతిని అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న హేమంత్ దారుణ హత్యకు గురయ్యాడు. కులం వేరు కావడం వల్లే.. హేమంత్‌ను తన తండ్రి లక్ష్మారెడ్డి కిడ్నాప్ చేయించి హత్యచేసినట్టు అవంతి ఆరోపిస్తోంది. నిన్న మధ్యాహ్నం తమ ఇద్దరినీ కిరాయి గూండాలు కారులో కిడ్నాప్ చేశారని అవంతి అంటోంది. ఆ తర్వాతను అవంతి తప్పించుకుని డయల్ 100 కి సమాచారం ఇచ్చినా గచ్చిబౌలి పోలీసులు పట్టించుకోలేదని చెబుతోంది. తన మేనమామ యుగంధర్ రెడ్డి హేమంత్‌ను హత్యచేయడంలో కీలక పాత్రపోషించినట్టు అవంత్ ఆరోపిస్తోంది. హేమంత్‌ను వెంటాడి కారులోకి ఎక్కించారని అవంతి చెబుతోంది. తన పేరు మీద ఉన్న ఆస్తులన్నీ నాన్నకు రాసిచ్చినట్టు అవంతి చెబుతోంది.
ఈ ఘటనలో హేమంత్ రెడ్డి డెడ్ బాడీని.. సంగారెడ్డి వద్ద పోలీసులు గుర్తించారు. అటు పోలీసులు మాత్రం... కేసు దర్యాప్తులో ఎలాంటి అలసత్వం వహించలేదని చెబుతున్నారు. అవంతి ఫిర్యాదు అందేసరికే హేమంత్ హత్య జరిగిపోయిందన్నారు. ఈ ఘటనకు సంబంధించి 12 మందిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. హేమంత్ హత్యతో బంధువులు, తండ్రి ప్రధాన పాత్ర పోషించారని పోలీసులు అంటున్నారు. అవంతిని 7 నెలలుగా గృహనిర్బంధం చేశారని హేమంత్ తల్లి ఆరోపిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com