Warangal: పోలీసుల వేధింపులు.. స్టేషన్ ముందే గడ్డిమందు తాగి యువకుడి ఆత్మహత్య..

Warangal: పోలీసుల వేధింపులు.. స్టేషన్ ముందే గడ్డిమందు తాగి యువకుడి ఆత్మహత్య..
X
Warangal: ఉమ్మడి వరంగల్‌లో పోలీసుల దాష్టీకానికి మరో యువకుడు బలైపోయాడు.

Warangal: ఉమ్మడి వరంగల్‌లో పోలీసుల దాష్టీకానికి మరో యువకుడు బలైపోయాడు. పోలీస్‌ స్టేషన్ ముందే గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసి చివరికి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. శ్రావణ్ అనే యువకుడు బైక్‌ EMIలు సకాలంలో కట్టడం లేదంటూ ఓ షో రూమ్‌ యజమానికి గణపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతన్ని స్టేషన్‌కు పిలిచిన SI ఉదయ్‌ కిరణ్‌ తీవ్రంగా కొట్టారు. మనస్తాపానికి గురైన యువకుడు స్టేషన్‌ బయటే గడ్డి మందు తాగాడు. వెంటనే అతన్ని వరంగల్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటన సంచలనం కావడంతో గణపురం SIతోపాటు, షోరూమ్‌ యజమానిపై ములుగు ASP సుధీర్‌ రామ్‌నాథ్‌ కేసు నమోదు చేశారు.

Tags

Next Story