సీఐఎస్ఎఫ్ ఉద్యోగినంటూ రివాల్వర్‌తో యువకుడు హల్ చల్
By - Nagesh Swarna |21 Nov 2020 10:07 AM GMT
శంషాబాద్‌లో సీఐఎస్ఎఫ్ ఉద్యోగినంటూ రివాల్వర్ తో హల్ చల్ సృష్టించిన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లోని బేగంపేటకు చెందిన సాహెల్ ఐఎస్ఎఫ్ ఉద్యోగినంటూ రివాల్వర్ తో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలో కొందరు యువకులు పోలీసులకు సమాచారం అందించడంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా సీఐఎస్ఎఫ్ ఉద్యోగి కాదని తేల్చారు.
బేగంపేటకు చెందిన సాహెల్ ప్రస్తుతం శంషాబాద్ లోని అహ్మద్ నగర్ లో నివాసం ఉంటూ ఎయిర్ పోర్ట్ లోని కార్గోలో ఉద్యోగం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సాహెల్ వద్ద నుంచి ఓ రివాల్వర్ , ఫేక్ ఐడీ కార్డు, బైకు స్వాధీనం చేసుకుని నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com