Secunderabad: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముట్టడికి ముందే ప్లాన్..! సోషల్ మీడియాలో గ్రూపులు..

Secunderabad: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముట్టడికి ముందుగానే ప్లాన్ చేసినట్లు ఇప్పటి వరకు వెల్లడైన ఆధారాలను బట్టి తెలుస్తోంది.. పక్కా ప్లాన్‌తోనే రైల్వే స్టేషన్‌లో విధ్వంసం జరిగినట్లుగా తెలుస్తోంది.. రైల్వే స్టేషన్ బ్లాక్ పేరుతో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసినట్లు పోలీసులు ఇచ్చిన వివరాలను బట్టి అర్థమవుతోంది.. ఈ గ్రూప్ ద్వారానే నిరసనలకు ప్లాన్ చేసినట్లుగా సమాచారం..
ఈనెల 15న మధ్యాహ్నం 1.50 గంటల సమయంలో గ్రూప్ క్రియేట్ చేయగా.. అదే రోజు రాత్రి 11.12 గంటల సమయంలో వరంగల్ డిస్ట్రిక్ట్ ఓన్లీ పేరుతో మరో గ్రూప్ క్రియేట్ అయింది.. ఈ రెండు గ్రూపుల్లో ఒక్కరోజులోనే దాదాపు వెయ్యి మంది వరకు జాయిన్ అయినట్లు పోలీసులు చెప్తున్నారు.. ఫోన్లు, మెసేజ్‌ల ద్వారా వారంతా అప్‌డేట్‌లో ఉన్నారు.. ఎక్కడికి వెళ్లాలి.. ఆందోళనలు ఎలా చేపట్టాలి అనే దానిపై ఎప్పటికప్పుడు సమాచారం వెళ్లినట్లుగా తెలుస్తోంది.
అగ్నిపథ్ స్కీమ్ అనౌన్స్‌మెంట్ తర్వాత వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసిన వీరంతా.. ఫోన్లు, మెసేజ్‌ల ద్వారా ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లో ఉన్నారు.. నిన్న రాత్రి పది గంటల సమయానికే స్టేషన్ లోపల చుట్టుపక్కల ప్రాంతాలకు 500 మంది వరకు చేరుకున్నారు.. ఇవాళ ఉదయం 9.30కల్లా బస్సులు, ట్యాక్సీలు, ప్రైవేట్ వెహికల్స్ ఏవి దొరికితే వాటిలో హైదరాబాద్ వచ్చేశారు మిగతా యువకులు.. పరీక్ష నిర్వహించాలంటూ మొదట స్టేషన్ ముట్టడికి ప్లాన్ చేశారు.. ఆ తర్వాత విధ్వంసానికి తెగబెడ్డారు..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com