Gangavva: గంగవ్వ ఇల్లు కట్టేసింది.. ఎలా ఉందో చూడండి..

Gangavva: యూట్యూబ్ స్టార్ గంగవ్వ చిరకాల స్వప్నం నిజమైంది. సొంతిల్ల కట్టుకోవాలన్న తన ఆశ నెరవేరింది. బిగ్ బాస్ హౌస్‌కు వచ్చి తన మనసులో మాట బయటపెట్టింది. తన కోరికను నలుగురితో పంచుకుంది.. హోస్ట్‌గా వ్యవహరించిన ఆ బాధ్యతను భుజానికి ఎత్తుకున్నారు. గంగవ్వ ఇల్లు కట్టుకునేందుకు సాయపడతానన్నారు. అన్నట్టుగానే రూ.7లక్షలు ఇచ్చారు.
బిగ్‌బాస్ షో ద్వారా రూ.11 లక్షలు సమకూరడంతో మరో రూ.3 లక్షలు అప్పు చేసి జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లిలో ఇల్లు కట్టుకుంది. నా కొత్త ఎలా ఉందంటూ ఇంటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. గంగవ్వ ఇంటి గృహప్రవేశానికి బిగ్‌బాస్ హౌస్‌లో పరిచయమైన అఖిల్, శివజ్యోతి, చొప్పదండి ఎమ్మెల్యేసుంకె రవిశంకర్, మై విలేజ్ షో టీం సభ్యులు సహా పలువురు హాజరయ్యారు.
గంగవ్వ గృహప్రవేశానికి సంబంధించిన వీడియోను మై విలేజ్ షో టీం యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన కొద్ది సేపటికే ట్రెండింగ్‌లో నిలిచింది. గంగవ్వ కల నెరవేరినందుకు నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com