కొత్త పార్టీ ఏర్పాటుపై షర్మిళ సంప్రదింపులు.. ఆత్మీయ సమ్మేళనం వాయిదా

X
కొత్త పార్టీ ఏర్పాటుపై సంప్రదింపులు కొనసాగిస్తున్న YS షర్మిళ ఇవాళ రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నేతలతో సమావేశం అవుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ నేతలతో ఒక దఫా చర్చలు పూర్తి చేసిన ఆమె.. మిగతా జిల్లాల నుంచి కూడా YSR అభిమానులు, సన్నిహితులు, నేతల అభిప్రాయాలు తీసుకుంటున్నారు.
అటు, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఈనెల 21న ఖమ్మంలో జరగాల్సిన ఆత్మీయ సమ్మేళనం వాయిదా పడింది. దీంతో.. షర్మిళను కలిసేందుకు ఖమ్మం నేతలంతా హైదరాబాద్‌కి వచ్చారు. మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి YS షర్మిళను కలిసారు.
భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే ముందు అందరితోనూ సంప్రదింపులు కొనసాగించాలని భావిస్తున్న షర్మిళ.. ఆత్మయ సమ్మేళనాలతో తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
