పాపం షర్మిలక్క.. మళ్లీ బుక్కయ్యింది..

పాపం షర్మిలక్క.. మళ్లీ బుక్కయ్యింది..
రాజకీయాలు అంటే ఇంటికో, వీధికో పరిమితమైనవి కావు.. రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెట్టామంటే ఎన్ని తెలియాలి, ఎన్ని తెలుసుకోవాలి..

రాజకీయాలు అంటే ఇంటికో, వీధికో పరిమితమైనవి కావు.. రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెట్టామంటే ఎన్ని తెలియాలి, ఎన్ని తెలుసుకోవాలి.. ఊరికే వచ్చేస్తామంటే ఉతికి ఆరేస్తారు. అసలే ఇప్పుడు సోషల్ మీడియా రాజ్యమేలుతున్న కాలం.. చీమ చిటుక్కుమన్నా చిరిగి చాటైపోద్ది.. పొరపాటున అన్నా అడ్డంగా బుక్కయిపోతారు.. అందుకే రాజకీయాల్లోకి రావాలంటే కనీస అవగాహన ఉండాలి. అందునా ఏపీ నుంచి తెలంగాణకి వచ్చి ఏదో చేసేస్తామంటే ఎందుకూరుకుంటారు.. ఎక్కడ తప్పు కనబడుతుందా అని వెతికి పట్టుకుని ఏకి పారేస్తారు.. ఎంత ప్రయత్నించినా ఏదో ఒక చోట దొరికి పోతున్నారు వైఎస్ షర్మిల.

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఆదివాసీ అమరవీరుల సంస్మరణ దినం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ షర్మిల హాజరై అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. ఆదీవాసీలు అన్యాయానికి గురవుతున్నారు. మా పార్టీ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో పోడు భూముల సమస్యలు పరిష్కరిస్తామని ఆమె అన్నారు. అనంతరం షర్మిల ఎంపీ సోయం బాపురావుతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎంపీగా ఉన్న మీరు సీఎంతో మాట్లాడి పోడు భూములకు పట్టాలిప్పించండి అని అన్నారు. దాంతో షాకైన ఆయన అమ్మా నేను బీజేపీ ఎంపీని తల్లీ అని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. దీంతో షర్మిల బాపురావును క్షమాపణ కోరారు. దీంతో అక్కడున్న వారంతా నవ్వుకున్నారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Tags

Next Story