పక్కా ప్రణాళికలతో వెళ్తున్న షర్మిల.. సమావేశానికి వచ్చిన వారికి ప్రశ్నాపత్రం

పక్కా ప్రణాళికలతో వెళ్తున్న షర్మిల.. సమావేశానికి వచ్చిన వారికి ప్రశ్నాపత్రం
షర్మిల ఇచ్చిన ప్రశ్నాపత్రంలో మొత్తం 11 ప్రశ్నలు ఉన్నాయి.

పార్టీ నిర్మాణానికి పక్కా ప్రణాళికలతో వెళ్తున్నట్టు కనిపిస్తున్నారు షర్మిల. ఇవాళ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నేతలతో లోటస్‌ పాండ్‌ నివాసంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి వచ్చిన వారికి ఒక ప్రశ్నావళిని సంధించారు షర్మిల. రెండు జిల్లాల నుంచి వచ్చిన దాదాపు 500 మంది నేతలు ఈ ప్రశ్నలకు సమాధానాలు రాశారు.

షర్మిల ఇచ్చిన ప్రశ్నాపత్రంలో మొత్తం 11 ప్రశ్నలు ఉన్నాయి. తెలంగాణలో ఎలాంటి వ్యూహంతో వెళ్లాలి, ఉద్యమకారులకు, తెలంగాణ సమాజానికి ఏ సమాధానం చెప్పాలనే దానిపై ప్రశ్నలు ఉన్నాయి. అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌, దూసుకొస్తున్న బీజేపీని నిలువరించడానికి ఎలాంటి వ్యూహంతో వెళ్తే బాగుంటుందో సలహాలు ఇవ్వాలని కోరారు. వచ్చే ఎన్నికల నాటికి బలమైన ప్రత్యామ్నాయంగా ఎదగడానికి ఉన్న అవకాశాలను చెప్పాలంటూ ఈ ప్రశ్నాపత్నం రూపొందించారు.

సడెన్‌గా తీసుకున్న రాజకీయ నిర్ణయంపై ప్రజలు ఏమనుకుంటున్నారన్నది ఇందులోని ప్రధాన ప్రశ్న. తెలంగాణకు వైఎస్‌ఆర్‌ ఏమేం చేశారు, మీ నియోజకవర్గాల్లో వైఎస్‌ఆర్‌ చేసిన అభివృద్ధి పనులేంటి అంటూ ప్రశ్నలు సంధించారు.



Tags

Read MoreRead Less
Next Story