నేను పార్టీ పెట్టడం జగన్‌కు ఇష్టం లేదు : షర్మిల

తెలంగాణలో పార్టీ పెట్టేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టిన వైఎస్ షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఏర్పాటులో భాగంగా ఇవాళ విద్యార్ధులతో సమావేశమైన షర్మిల... తాను పార్టీ పెట్టడం జగన్‌కు ఇష్టం లేదన్నారు. మీడియాతో చిట్ చాట్ నిర్వహించి ఆమె.... తనకు రాజకీయ ప్రాధాన్యత ఎందుకు ఇవ్వలేదో జగన్నే అడగాలన్నారు. తనకు తెలంగాణా ప్రయోజనాలే ముఖ్యని.... తెలంగాణ అభివృద్దిపై ఎవరికి శుత్తశుద్దిలేదని విమర్శించారు. కొందరు మతంపేరుతో.. ఇంకొందరు ఉద్యమం పేరుతో రాజకీయం చేస్తున్నారని షర్మిల ఆరోపించారు.
తెలంగాణాలో కొత్తరాజకీయ పార్టీ అవసరం ఉందన్నారు వైఎస్ షర్మిల. త్వరలోనే పార్టీ వివరాలు ప్రకటిస్తానని పేర్కొన్నారు. పాదయాత్రద్వారా ప్రజల్లోకి వెళ్తానని... ప్రతి అమరవీరుల కుటుంబం తలుపు తడుతానని ఆమె వివరించారు. తెలంగాణాలో ప్రతిపక్షం సమర్ధవంతంగా పనిచేయడంలేదని... దీంతో ఫామ్ హౌజ్ నుంచే పాలన సాగుతుందని విమర్శించారు. పెద్ద పెద్ద బడా నాయకులే అవసరంలేదని... మంచి నాయకులు ఎవరు తమపార్టీలోకి వచ్చినా ఆహ్వానిస్తామన్నారు.
తన స్థానికతను ఎవరు ప్రశ్నించాల్సిన అవసరం లేదన్నారు వైఎస్ షర్మిల. తాను తెలంగాణ కోడలునని చెప్పుకొచ్చారు. తాను హైదరాబాద్‌లో పుట్టిపెరిగానని.. ముమ్మాటికి తెలంగాణ బిడ్డనే అన్నారు. తనకు హైదరాబాద్ అంటే అత్యంత ఇష్టమని.. నగరంలో గల్లీగల్లీ తనకు తెలుసన్నారు. పార్టీ ఏర్పాటులో తన భర్త అనిల్, తల్లి విజయమ్మల సహాకారం ఉందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com