YS Sharmila: పాలేరు నుంచి పోటీ చేయాలనుకున్న షర్మిల!?

YS Sharmila: పాలేరు నుంచి పోటీ చేయాలనుకున్న షర్మిల!?
ఆ సీటు కోసం ఇప్పటికే పోటీలో ఉన్న తుమ్మల, పొంగులేటి

వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు ప్రక్రియ సిద్దమైనట్లు తెలుస్తోంది. అయితే.. కాంగ్రెస్ లో షర్మిల సేవలు తెలంగాణాలోనా? ఏపీలోనా? ఇదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. వాస్తవానికి షర్మిల పాలేరు నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. అయితే.. ఆ సీటు కోసం ఇప్పటికే తీవ్ర పోటీ ఉంది. తుమ్మల, పొంగులేటి పోటీలో ఉండటంతో... ఆమెకు పాలేరు నుంచి సీటు కష్టంగా మారింది. దీంతో షర్మిలకు ఏఐసీసీలో కీలక బాధ్యతలు అప్పగించేందుకు కాంగ్రెస్ సిద్దమైనట్లు తెలుస్తోంది. షర్మిలకు ఏపీలో పార్టీ పునరుజ్జీవ బాధ్యతలు కూడా అప్పగిస్తున్నట్లు సమాచారం.

తెలంగాణ ఎన్నికల తర్వాత ఏపీలో ఆమె ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో జగన్ వదిలిన బాణంగా అభివర్ణించుకున్న షర్మిల... ఇప్పుడు జగన్ పైనే అస్త్రంగా మారతున్నారనే ప్రచారం జరుగుతోంది. అధికారంలోకి వచ్చాక... సీఎం జగన్....షర్మిలను కరివేపాకులా తీసేశారు. జగన్‌ కారణంగానే... ఏపీ నుంచి తెలంగాణకు వచ్చి... వైఎస్సార్‌టీపీ పెట్టింది. తెలంగాణాలో తన పార్టీ బలోపేతం కోసం కృషి చేశారు.

తెలంగాణాలో సొంతంగా అవకాశాలు లేవనే భావనకు వచ్చారు షర్మిల. అందుకే వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు నిర్ణయించారు. అటు... కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్‌ సైతం షర్మిల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. జగన్‌పైకే షర్మిల బాణాన్ని ఎక్కుపెట్టే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story